దర్శి పట్టణంలో విత్తనాల అమ్మకం దుకాణాలపై బుధవారం అకస్మిక తనిఖీ చేసారు. ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి హర్ష, విజిలెన్స్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దాడులు జరిపి రికార్డులను పరిశీలించారు. దర్శిలో విజయసారధి ఎజెన్సీన్స్, జై కిసాన్ దుకాణాలను తనిఖీ చేసారు. జమ్మినేషన్ పరిశీలించారు. సోర్స్ సర్టిఫికెట్స్ పరిశీలించారు. నాలుగు ఐటమ్స్క సోర్స్ సర్టిఫికేట్ లేక పోవటంతో రూ. 1.30 లక్షల విలువైన విత్తనాల అమ్మకాలను నిలుపు దల చేసారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. రైతులు బిల్లులు తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధికారి బాలక్రిష్ణానాయక్, విజిలెన్స్ తహసీల్దార్ పాల్, ఎస్సై నాగేశ్వరరావు, హెడాకానిస్టేబుల్ రవి తదితరులు పాల్గొన్నారు.
విత్తనాల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీ
31
May