వేరుశనగ పంట నిల్వల్లో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.ప్రసాదరావు కోరారు. మండల కేంద్రమైన తాళ్లూరులో బుధవారం ఆయన వేరుశనగ పంట నిల్వ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ …విత్తనం కొరకు కావలసిన వేరుశనగ కాయ లను ఎండలో కాకుండా నీడలో ఆర బెట్టాలని, కాయల్లో తేమశాతం 9 కి లోపు ఉండేటట్లుగా చూడాలని ఆయన తెలిపారు. ఆరబెట్టిన తరువాత వేరుశెనగ కాయలను గోనె సంచులు, పాలిథిన్ సంచుల్లో నిలువ చేసుకోవాలని ఆయన తెలిపారు. కాయలను నిలువ చేసే సమయంలో కాయతోలుచు పురుగులు, ఇతర కీటకాల నుండి రక్షణ పొందడానికి 2-3 వారాలకు ఒకసారి మాలాథియాన్ 150 మిల్లీలీటర్ల ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని ఆయన తెలిపారు. ఇది రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు నాయక్, వెంకట రావు పాల్గొన్నారు.
వేరుశనగ పంట నిలవల్లో జాగ్రత్తలు పాటించాలి – వేరుశనగ నిల్వలు పరిశీలించి సూచనలు చేసిన వ్యవసాయ అధికారి ప్రసాదరావు
01
Jun