ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్న వలంటీర్ల సేవలు ప్రశంశనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో గురువారం వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముంగిటకే సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని అందులో వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించటంలో వలంటీర్ల ముఖ్య భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. అనంతరం సేవా వజ్ర ఇరువురికి, సేవ రత్నా ఐదుగురికి, సేవా మిత్ర 185 మందికి అవార్డులను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బొరిగళ్ల ఉషా మురళి, పార్టీ మాజీ అధ్యక్షుడు కందుల నారపరెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగడి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీలు మిట్టా కోటి రెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, సర్పంచిల సంఘం అధ్యక్షుడు నాగయ్య, సర్పంచి గ్రెస్ రత్నకుమారి, పలువురు సర్పంచి, ఎంపీటీసీలు అధికారులు ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, హౌసింగ్ డీఈ నీరీక్షణ రావు, ఎఈ హనుమంతరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొరిగళ్ల ఉషా మురళి, పార్టీ మాజీ అధ్యక్షుడు కందుల నారపరెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగడి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీలు మిట్టా కోటి రెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, సర్పంచిల సంఘం అధ్యక్షుడు నాగయ్య, సర్పంచి గ్రెస్ రత్నకుమారి, పలువురు సర్పంచి, ఎంపీటీసీలు అధికారులు ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, హౌసింగ్ డీఈ నీరీక్షణ రావు, ఎఈ హనుమంతరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


