అనాధ ఆశ్రమం వద్దు – ఆస్తిమా కివ్వు – వృద్ధుడిని కిడ్నాప్ చేసిన బంధువులు – గంటల వ్యవధిలో చేదించిన పోలీసులు

ఆ వృద్ధుడిది ఉన్నతాశయం. భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్నారు. తన ఆస్తి పది మంది మంచికి  ఉపయోగించాలనుకుకున్నారు.  బంధువులకు ఇది నచ్చలేదు. ఎలాగైనా కొట్టేయాలని ఆస్తి కొట్టేయాలని పన్నాగం పన్నారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని రాత్రికి రాత్రే అపహరించారు. ఆపై దాడి చేసి గాయపరిచారు. ఇందుకు సంబంధించిన కేసును పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే ఛేదించారు. దర్శి పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ మలికాగర్గ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దిరెడ్డి రామిరెడ్డిది నంద్యాల జిల్లా సంజాముల మండలం ముక్కమల్ల గ్రామం ప్రస్తుతం బేస్తవారపేట మండలం పూసలపాడులో నివాసం ఉంటున్నారు. భార్య నాలుగు నెలల క్రితం  మృతి
చెందారు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఒంటరిగా ఉంటు న్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆర్. పాపం పల్లి గ్రామానికి చెందిన పసువులు రాము, కళావతిలు, రామి రెడ్డి భార్యకు సమీప బంధువులు, భార్య మృతిచెందడం… పిల్లలు లేకపోవడంతో తన పేరిట ఉన్న 2.70 ఎకరాల పొలం, బ్యాంకులో దాచిన రూ.25 లక్షలతో అనాథాశ్రమం నిర్మించాలని రామిరెడ్డి భావించారు. రాము, కళావతి ఈ నిర్ణయంతో విభేదించారు. పొలం, నగదు తమకివ్వాలని వృద్ధుడిపై ఒత్తిడి చేశారు. అతను నిరాకరించడంతో అపహ రించేందుకు ప్రణాళిక రచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*స్నేహితుల సాయంతో పన్నాగం…:* వృద్ధుడు రామిరె డ్డిని అపహరించి ఆపై ఆస్తి, నగదు పొందాలని రాము, కళా వతి నిర్ణయించుకున్నారు. ఇందుకు స్నేహితులైన నంద్యాల జిల్లా ఫ్యాబిలి మండలం చండ్రపల్లికి చెందిన బోయ నాగార్జున, అదే జిల్లా పాండురంగాపురానికి చెందిన కారు డ్రైవర్ కేదార్నాథ్, రమేష్ ల సహకారం తీసుకున్నారు. రామి రెడ్డి పింఛను తీసుకునేందుకు బేస్తవారపేట మండలం పూసల పాడు గ్రామానికి వచ్చారు. ఈ విషయం ముందే తెలిసిన వారు మే 31న కారులో వచ్చి రామిరెడ్డిని అపహరించారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు 112 కు ఫోన్ చేసి పోలీసు లకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన బేస్తవారపేట ఎస్సై కె.మాధవరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మార్కాపురం డి.ఎస్.పి వీరరాఘవరెడ్డి, కంభం సీఐ ఎం.రాజేష్ నేతృ త్వంలో కంభం, అర్ధవీడు ఎస్సైలు నాగమల్లేశ్వరరావు ఎంవీ. నాయక్ అప్రమత్తం అయ్యారు. పందిళ్లపల్లి టోల్ ప్లాజా, దిగువమిట్టా చెక్పోస్టు వద్ద సీసీ కెమెరా ఫుటేజీ
పరిశీలించారు. కారు నంబరును గుర్తించి యజమాని నుంచి వివ రాలు తీసుకున్నారు. లోకేషన్ ఆధారంగా అర్ధవీడు ఎస్సై ఎంవీ. నాయక్ తన సిబ్బందితో తెలం గాణ రాష్ట్ర వెళ్లి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నంద్యాలలోని  గురు రాఘవేంద్ర బ్యాంకు నగర్ సమీపంలో వృద్ధుడిని వదిలినట్టు చెప్పారు. కంభం సీఐ బేస్తవారపేట ఎస్సైలు అక్కడికి వెళ్లి నంద్యాల పోలీసుల సాయంతో రామిరెడ్డి ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. ఒక గదిలో గాయాలతో బందీగా ఉన్న అతన్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సంఘటన చోటుచేసుకున్న పన్నెండు గంటల్లోపే , కేసు ఛేదించినందుకు డీఎస్సీ, సీఐ, ఎస్సై సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో శిక్షణ ఐసీఎస్ అధికారిణి అంకితా  సురాన్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి……

ఫిర్యాది;- తంగిరాల శ్రీరామి రెడ్డి s/o కోటిరెడ్డి, అయనముక్కల గ్రామము, దోర్నాల మండలం

*కిడ్నాప్ చేయబడిన వ్యక్తి :- * పెద్దిరెడ్డి రామిరెడ్డి, తండ్రి రామిరెడ్డి, 87 సం’లు, ముక్కమల్ల గ్రామము, సంజాముల మండలం, నంద్యాల జిల్లా ప్రస్తుతం పూసలపాడు గ్రామం, బెస్తవారిపేట మండల

ముద్దాయిల పేర్లు:- 1) A1 పసువుల రాము తండ్రి రామకృష్ణ, వయసు 30 సంవత్సరాలు, కులం పట్రా గొల్ల occu: వ్యవసాయం R.పాపం పల్లి గ్రామం, ఉయ్యాలవాడ మండలం, నంద్యాల జిల్లా

2) A2 బోయ నాగార్జున తండ్రి కంభలి రాముడు, వయస్సు: 36 సం. కులం. బోయ, చండ్రపల్లి గ్రామం, ప్యాభిలి మండలం, నంద్యాల జిల్లా

3) A4 బట్రాజ్ కేదార్ నాద్ తండ్రి సత్యనారాయణ, 29 సం’లు, బట్రాజ్ కులం, కార్ డ్రైవర్, పాండురంగాపురం గ్రామం, నంద్యాల మండలం మరియు జిల్లా

పరారీలో ఉన్న నిందితులు:
A3 రమేష్, A5 కళావతి

సీజ్ చేసిన వస్తువులు: కిడ్నాప్ చేయటానికి ఉపయోగించిన AP 39 DJ 2999 గల grey color Toyota etios కారును మరియు మూడు సెల్ ఫోన్ లు

కేసుల యొక్క సంక్షిప్త వాస్తవాలు: తేదీ 31.05.2023 మద్యాహ్నం 12.00 గంటల సమయంలో తంగిరాల అశోక్ రెడ్డి అను అతను 112 ఫోన్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పూసలపాడు గ్రామానికి కారులో వచ్చి పెద్ది రెడ్డి రామిరెడ్డి అను అతని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నారని చెప్పినాడు. వెంటనే బేస్తవారిపేట ఎస్ఐ నేరస్ధలం దగ్గరికి వెళ్ళి ఫూటేజ్ చూసి, కారు కలర్ grey color Toyota etios గా గుర్తించినారు. ప్రకాశం జిల్లా SP శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురం DSP ఆధ్వర్యంలో కంభం CI గారి పర్యవేక్షణ లో బెస్తవారిపేట ఎస్సై , అర్ధవీడు ఎస్సై గారు, కంభం ఎస్సై మూడు బృందాలుగా ఏర్పడి పందిల్లపల్లి టోల్ ప్లాజ, దిగువమిట్ట చెక్ పోస్ట్ దగ్గర CC పుటేజి లు చెక్ చేసి కారు నెంబర్ AP 39DJ 2999 గా గుర్తించినారు. అంతట కారు నెంబర్ ను సాంకేతిక పరిజ్ఞానముతో చెక్ చేయగా కార్ యజమాని పేరు, ఫోన్ నెంబర్ తెలుసుకొని, ఫోన్ నెంబర్ లొకేషన్ తీసుకొని, అర్ధవీడు SI మరియు సిబ్బంది కారు డ్రైవర్ ను తెలంగాణ రాష్ట్రము లోని Etikyal పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకొని విచారించగా, అతను 31.05.2023 ఉదయం పూసలపాడు గ్రామానికి బాడుగకు వెళ్లి, అక్కడ ఒక వ్యక్తిని ఎక్కించుకొని వచ్చి నంద్యాల లోని సంజీవ నగర్ లో గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ దగ్గర వదిలిపెట్టి వచ్చినాను అని చెప్పినాడు. అంతట అర్ధవీడు SI, బెస్తవారిపేట SI కి తెలియజేయగా, వెంటనే కంభం CI , బేస్తవారిపేట SI మరియు సిబ్బంది అక్కడకు వెళ్లి నంద్యాల పోలీస్ వారి సహాయంతో దెబ్బలతో ఉన్న బాధితుని కాపాడి బాధితుడిని రక్షించి, నిందితులు రాము A1 & A2 నాగార్జున & A4 కారు డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. నిందితులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. సమయానికి రామిరెడ్డి ని కనిపెట్టక పోయి ఉంటె ముద్దాయిలు అతన్ని చంపి వేసి ఉండేవారు.

నిందితుడు ఏ1 రాము ఏ5 కళావతి కుమారుడు & బాధితుడు సమీప బంధువులు. A2 & A 3 A1 యొక్క స్నేహితులు, A4 కారు డ్రైవర్. బాధితుడు దగ్గరి బంధువులైన ఏ1, ఏ5 నిందితులు అతని ఖాతాలో ఉన్న 25 లక్షల రూపాయలను దోచుకోవాలని, పూసలపాడు గ్రామంలోని 2 ఎకరాల 70 సెంట్ల భూమిని లాక్కోవాలనే దురుద్దేశంతో ఈ నేరానికి పాల్పడ్డారు. A2, A3, A4 మద్దతుతో నిందితుడు A1 రాము & A5 వృద్ధుని కిడ్నాప్ చేయడానికి ముందస్తు ప్లాన్‌తో సంఘటన జరగడానికి 5 రోజుల ముందు అంటే 26-05-23 న నంద్యాలలో అద్దెకు ఇల్లు తీసుకున్నారు. బాధితుడు వృద్ధాప్య పింఛను కోసం ఖచ్చితంగా తేదీ:31.05-2023న పూసలపాడు గ్రామానికి వస్తాడని తెలిసి ఆ రోజున అతన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. పక్కా ప్లాన్‌ ప్రకారం కిడ్నాప్‌ చేసారు. సాంకేతిక ఆధారాలు, అంటే సిసి టివి ఫుటేజీలు మరియు సెల్ ఫోన్ లొకేషన్ తదితరాలను ఉపయోగించి సుమారు 12 గంటల్లోనే కేసును గుర్తించి, నిందితులను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.

అభినందనలు: ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానముతో ద్వార త్వరితగతిన చేదించిన మార్కాపురం డిఎస్పీ వీర రాఘవ రెడ్డి,కంభం సీఐ యం.రాజేష్, బెస్తవారిపేట మాధవరావు, అర్ధవీడు SI వి.నాయక్, కంభం SI నాగ మల్లేశ్వరరావు, సిబ్బంది HC రఫీ, రామ్ మోహన్, శ్రీనివాసులు, శివకుమార్ రాజు లను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *