గడపగడపలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. పట్టణంలోని 8వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం జరిగింది. అధికారులతో మాట్లాడి సమస్యలు అక్కడి కక్కడే పరిష్కారం చేశారు. కొత్త ఆలోచనలతో ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వై.వి సుబ్బయ్య ,రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, మేడం మోహన్ రెడ్డి, మోహన్ బాబు, నాయకులు మారం శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, రఘునాథరెడ్డి, నాగేశ్వర రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జయసింహా, కోటిరెడ్డి, రెహమాన్, రంగస్వామిరెడ్డి పాల్గొన్నారు.



