దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దర్శి బ్రాండ్ గా మారింది. రియల్ వ్యాపారుల దెబ్బకి ప్రభుత్వ స్థలాలు గగ్గోలు పెడుతున్నాయి. వాగులు వంకలు, కొండలు, గుట్టలు ఏదైనా సరే రాత్రికి రాత్రే ప్లాట్లుగా మారుతున్నాయి. వేల రూపాయలకు కొన్న ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలోని దర్శి దొనకొండ కురిచేడు ముండ్లమూరు తాళ్లూరు ప్రాంతాలలో రియల్ వ్యాపారానికి కేంద్ర బిందువు దర్శిగా మారింది. నగర పంచాయతీ కావడం, రైల్వే నిర్మాణ పనులు జరుగుతూ ఉండడం, ఎటు చూసినా డబుల్ రోడ్ లు ఏర్పడడం, దగ్గర్లో కురిచేడు రైల్వే స్టేషన్ మరికొంత దూరంలో దొనకొండ రైల్వే స్టేషన్, ఇండస్ట్రియల్ హబ్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులే దర్శి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు తెచ్చాయి. కోర్టులో వివాదాలు ఉన్నా, డిస్ప్యూట్ ల్యాండ్స్ అయినా వాటిని కొనేందుకు అమ్మేందుకు నో ప్రాబ్లం అంటూ కొందరు బ్రోకర్లు వెలిశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయంటూ కొందరు సామాన్యులు రెవెన్యూ, నగర పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి ఎదుటే భూకబ్జాదారులు బోర్డులను పీకేస్తున్న సంఘటనలు దర్శి ప్రాంతంలో నెలకొన్నాయి. ఇటీవల దర్శి లోని కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డు, పొదిలి రోడ్డులలో రెవిన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిని పీకి పక్కన పడేసే రియల్ వ్యాపారుల దెబ్బకి రెవిన్యూ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక పొలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక కొందరు అధికారులు ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతున్న పరిస్థితులు దర్శిలో నెలకొన్నాయి.దర్శికి వచ్చిన రెవిన్యూ లేదా మున్సిపల్ అధికారులలో కొందరు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకునే ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంత పట్టాలాండ్ ఉంటే చాలు అంతకు నాలుగు గంతలు డీకే లాండ్స్ కలిపి సర్వే నెంబర్లు మార్చి మరి రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితులు కూడా దర్శిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శితోపాటు దొనకొండ ప్రాంతంలో కూడా దర్శికి చెందిన భూ బకాసురులు తిష్ట వేశారు.వందల ఎకరాల ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బలి చేస్తున్నారు. వీరి పూర్వపు ఆస్తులు ఏవో అక్కడ పెట్టినట్లు దౌర్జన్యాలకు కూడా దిగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అడంగల్ లలో పేర్లు మార్చడం, అనుభవదారులంటూ ఎంటర్ చేయించుకోవడం మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ వీటిని చూపుతూ బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే ప్రజా ప్రతినిధులే ఇక్కడ కీలక వ్యవహారం నడపడం సిగ్గుచేటుగా మారింది. ఎవరైనా అధికారి ఇదేమిటని ప్రశ్నిస్తే వారి నోర్లు నోట్ల కట్టలతో కుట్టేస్తున్నారు. మొత్తానికి దర్శి నియోజకవర్గంలో దర్శి దొనకొండ ప్రాంతాలు రియల్ వ్యాపారానికి నిలయాలుగా మారినట్లు విశ్వసనీయ సమాచారం. గూడు లేని సామాన్యుడు సెంటు స్థలం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటే వారికి జరగని న్యాయం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి క్షణాల్లో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దెబ్బకి రెవిన్యూ అధికారులు చేతులెత్తేయడంతో డైరెక్ట్ గా జిల్లా అధికారులే దర్శి ప్రాంతంలో తిష్ట వేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజల ఆస్తులను కైవసం చేసుకునే ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఫోటోలతో సహా ఫ్లెక్సీలు కట్టి మరీ మండల కేంద్రాలలో ఏర్పాటు చేయాలంటూ కొందరు స్థానికులు కోరుతున్నారు.
భూ కబ్జాలలో దర్శి ప్రాంతం టాప్-ఫస్ట్ మన దర్శి & నెక్స్ట్ దొనకొండ – డోంట్ కేర్ అంటున్న రియల్ బ్యాచ్
01
Jun