వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతున్నలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని వక్తలు అన్నారు. తాళ్లూరు-1 రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం రైతులకు 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని విత్తనాలను పంపిణీ చేసారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ అధ్యక్షతన సభను నిర్వహించారు. రైతులు భూసారాన్ని పెంచుకోవటానికి పచ్చిరొట్ట విత్తనాలను చక్కగా ఉపయోగపడతాయని వ్యవసాయధికారి ప్రసాదరావు తెలిపారు. జనుములు, పిల్లపిసర, జీలుగలు| సబ్సిడీపై ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 11 క్విటాళ్ల పంపిణీ చేసామని, ఇంకా ఎంత మంది రైతులు అయినా తీసుకోవచ్చని తెలిపారు. విఏఏ నాగరాజు
నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతన్నలకు మేలు – 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ
02
Jun