లక్కవరం మాజీ సర్పంచి, మాజీ కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు తూము ఇందిరమ్మ, వైఎస్సార్సీపీ ప్రధాన నాయకుడు తూము శివశంకర్ రెడ్డి కుమారుడు రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వివాహ శుభాకాంక్షలు అందించారు. లక్కవరంలో వారి స్వగృహంలో శుక్రవారం నూతన వరుడు రాకేష్ రెడ్డిని దీవించి అభినందనలు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, మండలంలోని సర్పంచిలు, ఎంపీటీసీలు, పలువురు ప్రముఖలు దీవేనలు అందించిన వారిలో ఉన్నారు.
