టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కాలినడకన తిరుమల పాదయాత్ర చేయడం అభినందనీయమని తిరుపతి పార్లమెంటు టిడిపిఅధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. మండలంలోని వేముల, కమ్మవారిపాలెం, గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు సురా శేసిరెడ్డి, కే కోటేశ్వరరావు,డి సోమశేఖర్, ఎన్ శ్రీనివాసరావులు గత నెల 26వ తేదీన బయలుదేరి ఈనెల రెండవ తేదీ శుక్రవారం తిరుమలకు చేరుకొని స్వామివారికి ముడుపులు చెల్లించి మొక్కు తీర్చుకున్నారు. రానున్న ఎన్నికలలో టిడిపి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. చంద్ర బాబు నాయుడు సారధ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా ముందు చూపుతో ఆయన పరిపాలన చేయడం ఆయనకే సాధ్యమన్నార. అనంతరం వారికి నిమ్మరసం ఇచ్చి దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు.
చంద్రబాబు కోసం పాదయాత్ర చేయడం అభినందనీయం
02
Jun