శివరామపురం గ్రామ కార్యదర్శిగా పద్మజ నియామకం

శివరామపురం గ్రామ కార్యదర్శిగా పి. పద్మజను తిరిగి నియమిస్తూ ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. గత నెల క్రితం పద్మజను రామభద్రాపురం ఇన్చార్జిగా నియమిస్తూ, శివరామపురంకు నాగం బొట్లపాలెం గ్రామకార్యదర్శి పురం నరేంద్రను ఇన్చార్జిగా నియమించారు. అయితే పురం నరేంద్రకు సర్పంచి అభ్యంతరంతో పూర్తిస్థాయిలో రికార్డులు అప్పగించక పోక పోవటంతో పాలనా సౌలభ్యం కోసం తాళ్లూరు గ్రామకార్యదర్శి ఎనోయూ ప్రసన్నకుమార్ను ఇన్చార్జిగా నియమించారు. అయితే ఆయన ఇన్చార్జిగా వెళ్లటానికి విముఖత చూపటం, పద్మజ మరలా అదే స్థానానికి వెళ్తానని అంగీకార పత్రం ఇవ్వటంతో స్పందించిన ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు ఎట్టకేలకు తిరిగి పద్మజను యథాస్థానానికి రెగ్యులర్ కార్యదర్శిగా నియమించారు. అయితే రాబోవు బదీలలో మరలా ఏమి జరుగుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *