తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో మాధవ స్వామి, సోమేశ్వర స్వామి ఆలయ భూములు కౌలు సాగుకు శనివారం వేలం పాటను నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. మాధవ స్వామి దేవస్థానంకు సంబంధించి 46.47 ఎకరాలు, సోమేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించి 43.93 ఎకరాలకు సాగుకు కౌలు పాటలను మాధవస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించబడునని తెలిపారు. ఆసక్తి గల రైతులు తగిన డిపాడిట్ను చెల్లించి దేవాదాయ శాఖ నిబంధనల మేరకు కౌలు పాటలో పాల్గోనవచ్చని ఈ ఓ ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం దేవదాయ శాఖ భూములు కౌలు సాగుకు వేలం పాట
02
Jun