ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అజెండా.. అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల ద్వారా వెం టనే పరిష్కరించారు. అనంతరం వికలాంగులకు స్కూటర్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా ప్రభుత్వం ముందంజలో ఉంద న్నారు. ప్రభుత్వం పార్టీలకతీతంగా పథకాలు అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమి టీలు పెట్టి టీడీపీ నేతలే ప్రభుత్వ సోమ్ము ప్రజలకంద కుండా దోచుకుతిన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఎక్కడా పార్టీలు చూడటం లేదని, ప్రాంతాలు చూడ టం లేదని, లబ్ధిదారుడైతే నేరుగా ఇంటికే వలంటీర్ల ద్వారా పథకాలు ఇంటికి చేరవేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..అని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనుకునే వారికి ఇదొక సదా వకాశమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి చెప్పారు. మం డల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య,కౌన్సిలర్ వీసీ రెడ్డి, వైఎ స్సార్ సీపీ నాయకులు సైదా పాల్గొన్నారు.

