లక్కవరం మాజీ సర్పంచి, మాజీ కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు తూము ఇందిరమ్మ, వైఎస్సార్సీపీ ప్రధాన నాయకుడు తూము శివశంకర్ రెడ్డి కుమారుడు రాకేష్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డిలు వివాహ శుభాకాంక్షలు అందించారు. లక్కవరంలో జరిగిన వివాహానికి శనివారం హాజరై నూతన వధూవరులు రాకేష్ రెడ్డి, ఆశ్వినిరెడ్డిలకు దీవేనలు అందించారు. అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్లపాటి మోషే, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ.వీ సుబ్బారెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, పలు గ్రామాల సర్పంచిలు, మాజీ సర్పంచిలు నాయకులు పాల్గొన్నారు.
