బొద్దికూరపాడులో మాధవ స్వామి, సోమేశ్వర స్వామి ఆలయ భూములు కౌలు సాగుకు శనివారం వేలం పాటను నిర్వహించారు. మాధవ స్వామి దేవస్థానంకు సంబంధించి 46.47 ఎకరాలకు గాను రూ.4.13 లక్షలు, సోమేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించి 43.93 ఎకరాలకు రూ. 3.55 లక్షలు సాగుకు కౌలు పాటలను రైతులు పాడుకున్నారు. ఈఓ భాస్కర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పులి అంజిరెడ్డి, సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
