విద్యుత్ జేఈ గా ఇమ్మానియేల్ బాబు బాధ్యతలు స్వీకరణ

ముండ్లమూరు విద్యుత్ సబ్స్టేషన్ లో జేఈగా కే ఇమ్మానియేల్ బాబు శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అశోక్ బాబు విజయవాడ వెళ్లడంతో ఆయన స్థానంలో ఇమ్మానియేల్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈయన దర్శి లోని రూరల్ సెక్షన్ జేఈ గా పని చేస్తూ బదిలీపై ముండ్లమూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండి మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తామన్నారు. విద్యుత్ అధికారులను సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నియామక పత్రాన్ని విద్యుత్ ఏ ఈ జె భూరాజుకు నియామక పత్రాన్ని అందించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *