టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని టిడిపి మండల ఉపాధ్యక్షులు గుద్దేటి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని పులిపాడు గ్రామంలో శనివారం పల్లె నిద్ర కార్యక్రమం గుద్దేటి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని మహిళలు, ప్రజలు, నిరుద్యోగ యువకులు ,ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. పరిటాల సురేష్ మాట్లాడుతూ …వైకాపా ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ముందుగా ఇంటింటికి టిడిపి ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు చిన్న వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, కాసా రామాంజనేయరెడ్డి, వేరే సి వెంకటేశ్వర రెడ్డి, ముక్కు మల్ల నర్సారెడ్డి, గంగవరపు శీను, దాసరి ప్రభుదాసు, గోపి, తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆమోదయోగ్యంగా టిడిపి మేనిఫెస్టో
03
Jun