ముఖ్యమంత్రి జగన్‌గారి ఈఘటనపై నిరంతరం సమీక్ష చేస్తున్నారు:
తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు:
పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు సీఎం పంపించారు:
కోరమాండల్ సహా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం:
ఏపీలో ఈరైళ్లు ఆగే ఆయా స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించాం:
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించాం:
వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారు:
వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నాం:
267 మంది సురక్షితంగా ఉన్నారని తేలింది:
20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి:
82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైంది:
113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ చేయడమో జరిగింది:
ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నాం:
అలాగే హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారు:
విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నారు:
ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారు:
స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారు:
10 మంది ట్రైను ఎక్కలేదు:
28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అవడమో జరిగింది:
వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టాం:
ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ కూడా ఆస్పత్రులను అలర్ట్ చేశాం:
గాయపడ్డవారు ఎవరు వచ్చినా.. వారికి చికిత్స అందిస్తాం:
విశాఖకు చేరుకున్న గాయపడ్డ ప్రయాణికులు ఇద్దరిని వెంటనే సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్పించాం:
వీరిలో ఒకరి తలకు, మరికొరికి వెన్నుపూసకు గాయం అయ్యింది:
మెరుగైన వైద్యం అందిస్తున్నాం:
ఒడిశాకు 108 అంబులెన్స్‌లు 25, ప్రయివేటు అంబులెన్స్‌లు మరో ౨౫ మొత్తంగా 50 అంబులెన్స్‌లు పంపించాం:
ఇవికాకుండా ఎమర్జెన్సీ కార్యకలాపాలకోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధంచేశాం:
అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తాం:
నేవీ సహకారాం కూడా తీసుకుంటున్నాం:
ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని నిర్ధారిత సమాచారం ఏమీ లేదు:
సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇంకా ఏమీ నిర్ధారించలేం:
కాని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం:
ముఖ్యమంత్రిగారు టైం టు టైం సమీక్ష చేస్తున్నారు:
పేషెంట్లను అవసరమైతే భువనేశ్వర్ అపోలోలో చేర్పించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నాం:
ఈ మేరకు అపోలో ఆస్పత్రితో మాట్లాడాం:
ప్రయాణికుల కుటుంభ సభ్యులు ఎవరైనా తమ వారి సమాచారాన్ని జిల్లాకలెక్టర్లకు అందించాలని కోరుతున్నాం.