హౌరా ట్రైన్ ఘోర ప్రమాదం నేపథ్యంలో గౌర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుపతి ఎంపి శ్రీ మద్దిల గురుమూర్తి గారు శనివారం రైల్వే స్టేషన్ కి వెళ్లి అధికారుల నుంచి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకున్నారు. మృతులు, గాయపడ్డవారు ఉన్నారా అని ఆరా తీశారు. రైల్వే రిజర్వేషన్ వివరాలు పరిశీలించారు.
ఎం పి గారి స్పీచ్ పాయింట్స్….
తిరుపతి 18 మంది రేణిగుంటల 8మంది నుంచి గూడూరు నుంచి ఇద్దరు ప్రయాణికులు, తిరుపతి నియోజకవర్గస్థాయిలో మొత్తం 28 మంది హౌరా ట్రైన్ లో ప్రయాణించారు, వీరంతా సురక్షితంగా ఉన్నారు. వీరికి అవసరమైనా సహయ సహకారాలు తిరుపతి రైల్వే అధికారులు అందిస్తున్నారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
ఎంపి గారికి తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పలా సత్యనారాయణ , ఇతర ఇతర రైల్వే అధికారులు ప్రయాణికుల వివరాలు తెలియజేశారు. అనంతరం రైల్వే స్టేషన్ దక్షిణం ynవైపున జరుగుతున్న మోడల్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. వేచివున్న ప్రయాణికుల తో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎం పి మద్దిల గురుమూర్తి వెంట సూళ్లురుపేట మునిసిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు.
హౌర రైలు ప్రమాదబాధితుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్: ఎంపి మద్దిల గురుమూర్తి
03
Jun