పసుపు పంటను రైతులు జూన్ నెల నాలుగో తేదీ లోపు రైతు భరోసా కేంద్రాల్లో వారి పేర్లను నమోదు చేసుకోవాలని ఏవో బి. ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పసుపు పంటను ఆయన నించారు. ఈ నెల 12 లోగా పంట కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.6,850లుగా ఉందన్నారు. ఈ-క్రాప్ నమోదు అయిన రైతులే విక్రయించేందుకు అవకాశం ఉందన్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు అయిందో, లేదో సరిచూసుకోవాలన్నారు. రైతులు పంటను శుభ్రం చేసి ఆరబెట్టుకొని ప్రభుత్వం సూచించిన నాణ్యతాప్రమాణాలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.
