తాళ్లూరు మండలం విఠలాపురంలో భూదేవి మాత ఆలయ పునః ప్రతిష్టా మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం విఠలాపురం మాజీ సర్పంచి కైపు అంజి రెడ్డి కుమారుడు కోటి రెడ్డి తన స్వంత పొలంలో భూదేవి ఆలయాన్ని భూమిలో బాగా లోతులో మెట్లు ద్వారా అమ్మవారిని సందర్శించుకునేలా ఏర్పాటు చేసారు. అయితే వర్షాలు ఎక్కువైన సమయంలో భూమిలో నీరు వస్తూ దర్శనానికి, భక్తులు అధిక సంఖ్యలో వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో గ్రహించిన భూదేవి మాత భక్త బృందం తిరిగి భూమిపై గ్లోబల్ ఆకారంలో ఏర్పాటు చేసి అందులో ఆదివారం భూ మాతను వేద మంత్రాల మధ్య పునః ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూ మాతను దర్శించున్నారు. అన్నదానం నిర్వహించారు.
