తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు ప్రాంతానికి సరైన వేళల ప్రకారం ఆర్టీసీ బస్సులు తిరిగే విధంగా చర్యలు చేపట్టా లని కోరుతూ ఆదివారం పలువురు ప్రముఖులు పొదిలి ఆర్టీసీ డిపో మేనేజరును కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఒంగోలు డిపో నుంచి బస్సులు సక్రమంగా తిరిగేవని, ప్రస్తుతం పొదిలి డిపో నుంచి సమయపాలన లేకుండా తిరగడంవల్ల ప్రయోజనం లేకపోతోందని వివరించారు. బొద్దికూరపాడు, వెలు గువారిపాలెం, నాగం బొట్లపాలెం, తూర్పు గంగవరం మీదుగా ఒంగోలుకు గతంలో మాదిరిగా బస్సులు నడపాలని నాగంబొట్ల పాలెం సర్పంచి చిమటా సుబ్బారావు, బీకేపాడు ఉప సర్పంచి పులి ప్రసాదరెడ్డి, వైకాపా నాయకుడు ఎం. బ్రహ్మారెడ్డి తదిత రులు కలిసి విన్నవించారు. వారం రోజుల్లో విజయవాడ బస్సు పునరుద్ధరిస్తామని, సమయానుకూలంగా బస్సులు నడుపుతా మని డీఎం హామీ ఇచ్చారని వారు తెలియజేశారు.
తాళ్లూరు మండలం బొద్దికూర పాడు రూట్ లో బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని వినతి
05
Jun