ఓ ఆర్ ఎస్ ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని మారళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఓ ఆర్ ఎస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో డిహైడ్రేషన్ నివారణకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని తాగితే డిహైడ్రేషన్ నుండి ఉపశమనం పొందుతారు అన్నారు. అదేవిధంగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ప్రపంచ పర్యవరం దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటరావు, సూపర్వైజర్ నాగేశ్వరరావ,హెల్త్ ఎడ్యుకేటర్ ఎస్.కె హుస్సేన్ బి, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
