జగనన్న విద్యాకానుకలను విద్యార్థులకు సకాలంలో అందించటంలో ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో వ్యవహరించాలని మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య అన్నారు. స్థానిక మండల రిసోర్స్ కేంద్రంలో సోమవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఎంఈఓ జి. సుబ్బయ్య మాట్లాడుతూ రాగిజావ విద్యార్థులకు ఇవ్వటానికి వచ్చిన గ్లాసులు విద్యార్థుల సంఖ్యను బట్టి తీసుకోవాలని సూచించారు. నాడు- నేడు పనులు పరోగతిపై చర్చించారు. ఇతర పలు అంశాలపై పాఠశాలల వారిగా సమీక్ష నిర్వహించారు.
జగనన్న విద్యా కానుకలు సమయానికి ఇవ్వాలి
06
Jun