చేపలు పట్టే ప్రతి ఒక్క మత్స్యకారుడు ఫిష్ ఆంధ్ర పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు అన్నారు. స్థానిక వైకెపి కార్యాలయంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల అభివృద్ధి కొరకు వారి జీవనాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ రైతులు వైకెపి పథకం ద్వారా స్త్రీ నిధి, ఉన్నతి, పథకాల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దళిత బహుజన రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మత్స్యకారులను గుర్తించి వారిని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. చేపలు పట్టే ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వడంతో పాటు మత్స్యకారులు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు, ఆర్ తేజస్విని, వెలుగు సీసీలు పి గురవయ్య, డేవిడ్, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఫిష్ ఆంధ్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
06
Jun