గ్రామీణ ప్రాంతాల్లోనే గృహవాసులు వేరే ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి వివరాలు పోలీసులకు తెలియజేయాలని ఎస్ ఐ. ఎల్ సంపత్ కుమార్ కోరారు. మండలంలోని పోలవరం, నాయుడుపాలెం గ్రామాలలో మంగళవారం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ ఆదేశాల మేరకు దొంగతనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందున గృహవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వేరే గ్రామాలకు వెళ్లే సమయంలో తమ ఇంటి వివరాల తో పాటు, బంగారం ఆభరణాలు, నగదు బ్యాంకులో పెట్టుకొని వెళ్లాలన్నారు. మీ ఇంటి సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే పోలీసు వారు మీ ఇంటికి ఒక అలారం ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఎవరైనా ఇంటి తాళాలను గూట్లో గాని, కిటికీలో గాని, పెట్టకుండా మీ వెంట తీసుకువెళ్లాలన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామస్తుల తో సంయుక్తంగా రాత్రి గస్తీ తిరగాలన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం చేరవేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అంకమ్మరావు, సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి శ్రీదేవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
వేరే ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
06
Jun