గ్యాస్ లీక్ అయి దుకాణం దగ్ధం- రెండు లక్షల ఆస్తి నష్టం- లబోదిబోమంటున్న బాధితుడు- ఆదుకోవాలని అధికారులకు వినతి

ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో బుధవారం దుకాణంలో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించి దుకాణం దగ్ధమైంది. రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం పక్కన సన్నే బోయిన ఏడుకొండలకు చెందిన దుకాణంలో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ దుకాణం లో ఉన్న బిస్కెట్లు, టీ పొడి, అరటికాయలు, ఆపిల్ కాయలు, కొబ్బరి బోండాలు తినుబండారాలు, ఎలక్ట్రికల్ సామాన్లు, చెప్పులు ఫ్యాన్సీ కి సంబంధించిన వస్తువులన్నీ కాలి బూడిద అయినాయి. తక్షణమే అప్రమత్తమైన గ్రామస్తులు ప్రజలు సమీపంలో ఉన్న నీటి వనరులతో పైపులతో బిందెలతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్ప నట్లయింది. అయితే ఈ ఘటనలో నష్టపోయిన ఏడుకొండలు తమను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *