బిసీ సంక్షేమ మరియు సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేషిలోని ఉద్యోగుల జీతభత్యాలు అందక పేషి ఉద్యోగులు తెరవలేదని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవం…
ఉద్యోగులు రోజు మాదిరిగానే విధులకు హాజరవడానికి వచ్చే క్రమంలో జరిగిన ఆలస్యం వల్ల పేషి తెరవడం కొంత సమయం ఆలస్యం అయిన విషయాన్ని అభూత కల్పనతో కొన్ని మీడియా ఛానల్స్ మంత్రి పేషికి తాళలు అంటూ అవాస్తవాలను ప్రచారం చేశాయి…
పేషిలో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటం మిగిలిన ఒక్క అటెండర్ వచ్చే సమయం ఆలస్యం కావడం…దానితో పేషి ఆలస్యంగా తెరవడం జరిగిన వాస్తవం….
రోజు మాదిరిగానే నేడు పేషిలో ఒఎస్డీ, పిఆర్ఓలు,అటెండర్లు తమ విధిలో పాల్గొని…పేషికి వచ్చే వారి నుండి అభ్యర్థనలు, అర్జిలను అందింపుచుకుంటూ…వారి విధి నిర్వహణలో ఉన్నారు…
ఇలా ఉన్న వాస్తవాలను కప్పి పుచ్చి ప్రభుత్వం మీదా బురద జల్లే కార్యక్రమంలో భాగంగా కొన్ని మీడియా ఛానల్స్ వాస్తవాలన్ని వక్రీకరించాయి…
జీతభత్యాలు విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేవని ప్రజలకు అవాస్తవ సమాచారం ఇచ్చి ప్రభుత్వం మీదా బురదజల్లే ప్రయత్నంలో భాగంగా కొన్ని మీడియా ఛానల్స్ చేసిన పని అని మంత్రి పేషి ఈ వార్తను ఖండించింది..