టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరత.…9 పోస్టులకు 4 గురు అధికారులే.…ఖాళీలు భర్తీ చేయకపోతే ప్రభుత్వానికి గండి.ఊపందుకుంటున్న అక్రమ నిర్మాణాలు,వెంచర్లు.

నంద్యాల మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చే శాఖ టౌన్ ప్లానింగ్ విభాగం.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడంతో ప్రభుత్వానికి భారీగా గండి పడుతుంది.ప్రస్తుతం వున్న అధికారులు సమావేశాలకు,ఆఫీస్ పనులకే పరిమితమవుతున్నారు.పట్టణంలో ఎక్కడ చూసినా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు,వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.వున్న అధికారులకు తెలిసే లోపు బహుళ అంతస్థులు వెలుస్తున్నాయి.అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని నేతల వత్తిడులు అధికం కావడంతో అధికారులు ముందుకు వెళ్లలేని పరిస్తితి.ప్రస్తుతం జిల్లా కావడంతో వుండాల్సిన అధికారులు ఏసిపి ఇద్దరు, టిపీఓ ఒకరు, టీపి ఎస్ లు ఇద్దరు, టి పీబిఓ లు నలుగురు వుండాలి.ఇందుకు విరుద్ధంగా కేవలం నలుగురు అధికారులు మాత్రమే వుండడంతో ఫీల్డ్ వర్క్ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు.టౌన్ ప్లానింగ్ కు వె సలు బాటు కల్పించేందుకు ప్లానింగ్ సెక్రెటరీ లను ఏర్పాటు చేసినా అధికారులకు సహకరించకుండా సొంత నిర్ణయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అనుమతులు లేకుండా ఇల్లు,వెంచర్లు వేస్తున్న వారితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వానికి భారీగా గండి పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏసిభి దాడులే ఉదాహరణకు చెప్పవచ్చు.క్రిందిస్తాయి సిబ్బంది చేస్తున్న అవినీతికి అధికారులు బలి కావలసిందే.ప్రభుత్వం ఇప్పటికైనా అధికారుల కొరత తీరుస్తారని ఆశిద్దాం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *