కార్పొరేట్ కు దీటుగా విద్యాబోధన -పిల్లలు పోటీపడి చదవాలి- గత ప్రభుత్వంలో పాఠశాలలను గాలికొదిలిన చంద్రబాబు – జగనన్న విద్యాకానుక పంపిణీలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

కార్పొరేట్ పాఠశాలలో పోటీ పడేలా ఉపాధ్యా యులు విద్యార్థులకు బోధన చేయాలని జిల్లా పరి షత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సూచిం చారు. దర్శి మండలంలోని రాజంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను సోమవారం జెడ్పీ చైర్పర్సన్ విద్యార్థులకు అందజే చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… గత ప్రభుత్వం విద్యార్థులను జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంచి భజనం, విద్య అందిస్తున్నామని తెలిపారు. తల్లి దండ్రులు విద్యార్థులను చదివించే స్థోమత లేక ఇబ్బందులు పడకుండా అమ్మవడి, విద్యాదీవెన, వసతిదీవెన అందించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ దీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు జన్మభూమి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ పథకాలన్నీ వారే దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలకతీతంగా అర్హులందరికీ పాఠశాలల ఆధునీకీకరణకు వేల కోట్లు ఖర్చు చేస్తు లబ్ధి చేకూర్చేలా దేశంలోనే ఆదర్శవంతమైన సీఎం అన్నారు. పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న కానుక అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. పాఠశాలలో గ్రౌండ్ లెవల్, సైడు జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పుష్టికర భోజనం అందిస్తున్నట్లు తెలిపారు .
పాఠశాలలో లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని కోరగా.. ..వెంటనే రూరల్ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చారు. అనంతరం విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు గోళ్లపాటి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, ఎంపీపీ సుధారాణి, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంఈఓ కాకర్ల రఘురామయ్య, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ఆర్ చిన్న అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *