విద్యాకానుక విద్యార్థులకు వరం – వికే ప్రభుత్వ పాఠశాలలో విద్యాకానుక -జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి

జగనన్న విద్యాకానుక విద్యార్థులకు వరం అని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తాళ్లూరు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జగనన్న విద్యాకానుకను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నాడు- నేడుతో పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి కంటె అధనంగా సౌకర్యాలు ఏర్పాటు అయినట్లు చెప్పారు. నాడు నేడు ద్వారా గడచిన 75 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం పాఠశాలల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అనేక పథకాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, కోఅప్షన్ మెంబర్ కరిముల్లా, హెచ్ఎం అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *