చిన్నారులను అంగన్వాడీలలో చేర్పించాలని సూపర్వైజర్లు జ్యోతి, సునీతలు కోరారు. తాళ్లూరు మండలంలోని మాధవరం, రాజానగరం గ్రామాలలో బుధవారం జన బాగస్యామ్యం ( జనబాగీధార్) కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులకు ప్రభుత్వం అంగన్వాడీ పాఠశాలల ద్వారా చిన్నారులకు, స్త్రీలకు అందిస్తున్న సేవల పట్ల అవగాహన కల్పించారు. మూడేళ్లు నిండిన చిన్నారులకు పాఠశాలలకు పంపించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య, మహిళా పోలీసులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు


