తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సహకారంతో బెల్లంకొండ వారి పాలెంలో నిర్మించనున్న అంకమ్మ తల్లి గుడి నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. బెల్లంకొండ వారి పాలెంకు చెందిన తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి దంపతులు, ఎస్టీ కాలనీ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నిర్మాణానికి సహకరించి రూ. 10లక్షలు మంజూరు చేయించిన టిటిడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

