ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని లక్కవరం మరియు నాగంబొట్లవారి పాలెం గ్రామాలలో పిపిఎల్ కంపెనీ ప్రతినిధులుచే బుధవారం రైతు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా పంటల కు అందించాల్సిన సూక్ష్మ పోషకాలు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. రైతులకు సలహాలు సూచనలు కొరకు జై కిసాన్ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. పి పి ఎల్ కంపెనీలో లభ్యమగు ఉత్పత్తుల గురించి వివరించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ ఆఫీసర్ పి ప్రభాకర్, జేఏ లక్ష్మీదేవి, జే కేస్ ప్రసాద్ , డి బి టి ఎస్ వెంకట్రావు మరియు రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పలు గ్రామాలలో పిపిఎల్ కంపెనీ ప్రతినిధుల రైతు సమావేశం నిర్వహణ
14
Jun