దర్శి మండలంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు మండల పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు దర్శి మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ …2023 మరియు 2024 సంవత్సరానికి సంబంధించిన వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు NPCI ఇన్ ఆక్టివ్ కారణంగా కొంతమందికి జమకాలేదని తెలియజేశారు. ఈ యొక్క డబ్బులు జమ కాని రైతులు యొక్క జాబితా ప్రతి రైతు భరోసా కేంద్రం లో అందుబాటులో ఉందని సంబంధిత రైతులకు వెంటనే ఈ విషయాన్ని తెలియపరిచి వారి యొక్క బ్యాంకు ఖాతాలను NPCI ని యాక్టివ్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు.
అదేవిధంగా మండల పరిధిలోని కౌలు రైతులు అందరికీ కౌలు రైతు కార్డు జారీ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కౌలు రైతు కార్డు గురించి రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు
అదేవిధంగా మండల పరిధిలోని చాలామంది రైతులు ఇంతవరకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన యోజన పథకం కింద ఈ కేవైసీ చేయించుకోలేదని దీని ద్వారా తరువాత విడత పిఎం కిసాన్ డబ్బులు జమ కావని కావున సంబంధిత రైతులు వెంటనే ఈకేవైసి చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. నీకేవైసీ చేయించుకోవడానికి ఈ నెల 25 చివరి తేదీ అని తెలియజేశారు.
అదేవిధంగా మండల పరిధిలోని రైతు సోదరులందరూ కూడా సంబంధిత రైతు భరోసా కేంద్రం వద్ద మీ ఆధార్ కార్డు పొలం పాస్బుక్ లతో పచ్చి పచ్చిరొట్ట ఎరువులైన జనుములు జిలుగులు పిల్లి పెసరలు రాయితీపై పొందవచ్చునని తెలియజేశారు.
రైతులు తమ ఖాతాలను సరి చూసుకోవాలి – దర్శి మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్
14
Jun