ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు మండల స్థాయిలో అనేక వందల మంది భూ యజమానులు వద్ద భూములు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులకు చాలా గ్రామలలో భూములను సాగు చేస్తున్నప్పటికీ నేటికీ పంట సాగు ధ్రువీకరణ పత్రం (CCRC) పొందలేకపోతున్నారనీ …. ఆయా దళితవాడలో కౌలు రైతుల కొరకు గ్రామ సభ నిర్వహించాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు స్థానిక మండల తహసిల్దార్ కె.వి ప్రసాద్ వినతిపత్రం ఇస్తూ, మండల స్థాయిలో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించడం కష్టమైన ఈ కాలంలో కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయం గా ఉందని, వారికి బ్యాంక్ నుండి, పంట రుణాలు, పంట బీమా, వివిధ సబ్సిడీ పథకాలు పొందలేకపోతున్నారని అలాగే మండల స్థాయిలో ఉన్న దేవాదాయ భూములు వేలంపాటలో ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకు అవకాశం కల్పించి ఆభూములు పొందిన రైతులకు ఒకేసారి కౌలు చెల్లించకుండా కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సు ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీలకు 3 విడుదల చెల్లింపు విధానాన్ని అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ కె వి ప్రసాద్ మాట్లాడుతూ….. అన్ని రెవిన్యూ గ్రామాల పరిధిలో ఇప్పటికీ అన్ని గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల వారిగా కౌలు రైతుల గుర్తింపు కొరకు గ్రామ సభలు నిర్వహిస్తామని తహసిల్దార్ తెలియజేశారు. తదుపరి తహసిల్దార్ మరియు ముండ్లమూరు, తాళ్లూరు మండలాల డి బి ఆర్సి ఏరియా కో-ఆర్డినేటర్ గోపన పోయిన వెంకటరావులతో పంట సాగు దారుల చట్టం ప్రచారోద్యమం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది. తదుపరి లక్కవరం గ్రామంలో పoట సాగు దారుల చట్టం పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే వెంకటేశ్వర్లు,వైఎస్ఆర్సిపి నాయకులు కూకట్ల వీరబ్రహ్మం గ్రామ పెద్దలు, కౌలు రైతులు పాల్గొన్నారు.
