హీటెక్కిస్తున్న ఏఎంసి పదవులు…ఇప్పటివరకూ 9 మంది చైర్మన్లు…

దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల పదవీకాలం ముగిసే సమయం ఆసన్నమవుతుండడంతో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. ఈ ఐదేళ్ల పాలనకు ఇదే చివరి అవకాశం కావడంతో ఒక్కసారైనా చైర్మన్ పదవిలో కూర్చోవాలంటూ కొంతమంది ఆశవాహులు వారి స్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏఎంసి చైర్మన్ ల పదవులు 1977లో చేపట్టిన నాటి నుండి 2022 వరకు మొత్తం 9 మంది ఏఎంసీ చైర్మన్లు కాగా వారిలో 8 మంది ఓసీ లు ఉండడం గమనార్హం. కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఏఎంసి పదవిని బీసీలకు కట్టబెట్టారు. ఎస్సీ ఎస్టీలకు చైర్మన్ పదవి కేవలం అందని ద్రాక్ష గానే మారింది, వీరితోపాటు మైనారిటీలకు కుడా చైర్మన్ పదవి అందనంత దూరంలో ఉన్నట్లుంది. ఓసి బిసి ఎస్సి ఎస్టి మైనారిటీలు అంటూ మొత్తం ఐదు రకాల కేటగిరీలు చేసినప్పటికీ పదవుల విషయంలో రిజర్వేషన్లను తొలగిస్తూ నాయకులు ఆనందం పొందుతున్నారు. నియోజకవర్గంలో 1,50,000 మందికి పైగా బడుగు బలహీన వర్గాల వారు ఉండగా ఒక్కసారి కూడా పదవులు రాకపోవడంతో బలహీనవర్గాలకు చెందినవారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు కూడా ఒక్కసారైనా మాకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టారు. ఇప్పటికే దర్శికి మూడుసార్లు అవకాశం ఇచ్చారని మిగిలిన తాళ్లూరు దొనకొండ ముండ్లమూరుకు చెందిన నాయకులు కూడా మాకు కావాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ఏఎంసి పదవి మాకే కావాలంటూ మండల స్థాయి నాయకులు కూడా ఇప్పుడు బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దర్శి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏఎంసీ చైర్మన్ లు గా పదవులు పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  1. మేరువ నాగిరెడ్డి – (ఓసి)
    (1977 నుండి 1979 వరకు)
  2. పలగాని యల్లమందారెడ్డి – (ఓసి)
    (1994 నుండి 1995 వరకు)
  3. మాగం పెదకోటయ్య – (ఓసి)
    (1997 నుండి 2000 వరకు)
  4. కొత్త మారం వెంకటేశ్వర రెడ్డి – (ఓసి)
    (2007 నుండి 2010 వరకు)
  5. రాచగొర్ల వెంకటయ్య – (బిసి)
    (2012 నుండి 2014 వరకు)
  6. సూరె చిన సుబ్బారావు – (ఓసి)
    (2016 నుండి 2018 వరకు)
  7. వెన్నపూస వెంకటరెడ్డి – (ఓసి)
    (2020 నుండి 2021 వరకు)

8.యిడమకంటి వేణుగోపాలరెడ్డి – (ఓసి)
(2021 నుండి 2022 వరకు)

  1. ఎనుముల వెంకట సుబ్బయ్య (ఓసి)
    (2022 నుండి కొనసాగుతున్నారు)

ఇదే చివరి అవకాశం కావడంతో ఏఎంసి పదవిని మిగిలిన సామాజిక వర్గాలకు ఇచ్చి వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా మరలా ఓసి సామాజిక వర్గాలనే కొనసాగిస్తారా అనే ప్రశ్న కూడా దర్శి నియోజకవర్గంలో మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *