వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి నుసుం చిన ఆంజనేయులు పార్టీ
అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేని వని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
అన్నారు. మాధవరం గ్రామంలో గురువారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆయన గ్రామంలో పార్టీ అభ్యున్నతికి,మౌళిక వసతుల ఏర్పాటుకు చేసిన కృషిని కొనియాడారు. మాధవరం సర్పంచి భర్త తాటికొండ రేణుక భర్త ఏడుకొండలుచిత్ర పటానికి నివాళులు అర్పించారు. మాధవరంలో అనారోగ్యంతో బాధపడుతున్న నుసుం సుబ్బారెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు సుబ్బారావు,వలి, పిఎస్ శ్రీకాంత్ రెడ్డి , మాజీ సర్పంచి సుబ్బా రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


