నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం జగ న్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాల యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జరిగిన స్కిల్హబ్ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… స్కిల్హబ్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలుకల్పించడం శుభపరిణామమన్నారు. ఉద్యోగాలు పొందిన వారు క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో మెళకువలతో ఉద్యోగాల్లో రాణించాలని కోరారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ మాట్లాడుతూ …రెండో విడతలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ధ్రువపత్రాలు తీసుకున్న వారికి అభినంద నలు తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం మాట్లాడుతూ… ఉద్యోగ వివరాలు, జీతభత్యాల గురించి వివరించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సావిత్రి, ఎ.నగేష్, మర్తనాలి, ఆర్డ బ్ల్యూఎస్ కె. సుబ్బారావు, సురేష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
