చిరుధాన్యాల సాగు పెంపునకు ప్రభుత్వం రైతులకు ఎక్కువగా రాయితీలు ఇచ్చి ప్రొత్సహిస్తుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు ఆర్బికే వద్ద శనివారం రైతులకు మిల్లెట్స్ కిట్స్ను పంపిణీ చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు కిట్స్ను అందించారు. ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ 2023 సంవత్సరం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున రైతులు తమ బాధ్యతగా కొంత విస్తీర్ణంలో సాగు చేసి స్వంతగా నివాసంలో చిరుధాన్యాలు ఉపయోగించుకుని తినాలని కోరారు. కార్యక్రమంలో ఎఈఓ నాగరాజు, డిబిఆర్సీ కోఆర్డినేటర్ డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగు పెంపునకు ప్రభత్వం ప్రోత్సాహం – మిని కిట్స్ పంపిణీ
17
Jun