గడప గడపలో సంక్షేమ లబ్ధి -దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

గడప గడపలో సంక్షేమ కాంతులు విరజిమ్ము తున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని ఎనిమిదో వార్డులో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిం చారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గడపగ డపకు తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ …సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. పార్టీలకతీతం గా ప్రజలకు లబ్ధి చేకూర్చేది ఒక్క వైఎస్సార్ సీపీ
ప్రభుత్వమేనన్నారు. ఏ గడపకు వెళ్లినా సీఎం పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస మహేష్ , మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వై సుబ్బయ్య , రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, , కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, బాబురావు, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, మాజీ చైర్మన్ పూసల చిన్నయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు గంజి వెంకటే శ్వరరెడ్డి, కిక్కురు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెం కటేశ్వరరెడ్డి, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *