అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్ళుగా,ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందన్నారు.ఎన్నికలలోనూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలోనే ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తారన్నారు.
అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, తదితర పథకాలు సుమారుగా అన్ని ఇళ్లకు అందడంతో గడప గడపనా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు లబ్ది అందడం పై ప్రజలు సంతోషం వ్యక్తం చేసి, సీఎం జగన్ గారికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి అండగా ఉంటామన్నారు . కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వై వి సుబ్బయ్య, మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి,ఎంపీపీ, కౌన్సిలర్ ఆవుల జ్యోతి మేడగం మోహన్ రెడ్డి, బాబురావు, మోహన్ బాబు, సాని కొమ్ము తిరుపతిరెడ్డి, కేసరి రాంభూపాల్ రెడ్డి, బండి గోపాల్ రెడ్డి, రమణారెడ్డి, గోపు ఎర్రయ్య, వేమిరెడ్డి చెన్నారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, గురవయ్య, కేసరి శ్రీనివాస్ రెడ్డి, గంజి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .


