తాళ్లూరు మండలం లో
ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి అన్నారు. కస్తూరిభా పాఠశాలలో సోమవారం జగనన్న ఆణిముత్యాలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఎంఈఓ జి. సుబ్బయ్య అధ్యక్షతన సభను నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం విద్యావ్యవస్థ పటిష్టానికి
నాడు – నేడు ద్వారా ఎంతో కృషి చేసిందని చెప్పారు. విద్యార్థులకు జగనన్న అమ్మ ఒడి ఎంతో ప్రోత్సాహకంగా ఉందని అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మరింత ప్రతిభ చాటాలని ప్రభుత్వ పొత్సాహంతో పాటు తాను కూడ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి పొత్సాహక బహుమతి రూ.5వేలు అందిస్తానని చెప్పారు. ఎంఈఓ జి. సుబ్బయ్య మాట్లాడుతూ… మండలంలో 7 పాఠశాలలో 21మందికి జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహక బహుమతులు అందించినట్లు చెప్పారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, మల్కాపురం సర్పంచి వలి. కెబిబీపి ప్రిన్సిపాల్ సుజిత తదితరులు పాల్గొన్నారు. లక్కవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలు పొత్సాహక బహుమతులు అందించారు. సర్పంచి వరలక్ష్మి మాజీ సర్పంచిలు టిఐ శంకర్ రెడ్డి. టీవీ సుబ్బారెడ్డి, హెచ్ఎం రమణ కుమార్. ఎస్ఎంసీ చైర్మన్ పరమేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి వక్తలు కొనియాడారు.

