విద్యా రంగంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి భవనాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించగా, శిలాఫలకాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ….విద్యార్థులకు అందిం చే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి భవనాన్ని సువిశాలంగా, చక్కని వాతావరణంలో 1100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉండేందుకు అనువుగా నిర్మించారన్నారు. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదే శించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రూ.21.17 కోట్ల గురుకుల పాఠశాల భవనాల నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో తాను మంత్రులతో మాట్లాడి నిధులు విడుదల చేయించి భవన నిర్మాణం పూర్తిచేయించానన్నారు.
సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అనంతరం జగనన్న ఆణి ముత్యాలను సన్మానించి వారికి మెడల్, సర్టిఫికెట్, నగదు బహుమతులు అందజేశారు. మధ్యాహ్న భో.. జనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. కార్య క్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనరు షేక్, సైదా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డీసీవో డీ జయ, ఆర్డీఓ తోట అజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ చైర్మన్ కే నాగేశ్వరరావు, ముండ్లమూరు ,దొనకొండ ఎంపీపీలు సునీతా బ్రహ్మారెడ్డి, ఉషామురళి, సొసైటీ ప్రెసిడెంట్ మర్రి సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీలు బుల్లం వెంకట నర్సయ్య, కానాల శివారెడ్డి, కురిచేడు, కల్లూరు, బయ్యవరం, పడమర గంగవరం సర్పంచ్లు కేసన పల్లి కృష్ణయ్య, ఎన్ రామకృష్ణ, యం నాగేశ్వరరావు, కాసు భాస్కరరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాళ్లు బండి బల రామిరెడ్డి, పి.వి. రమణ, నాయకులు వరికూటి వెం కటేశ్వర్లు, వైవీ సుబ్బయ్య, మేరువ పిచ్చిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, కండె గంగయ్య, సిద్ది వెంకట రెడ్డి, జ్యోతి అంకాలయ్య పాల్గొన్నారు.

