ప్రజలకు మేలైన వైద్యం అందించి ఆదరించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. చందలూరు పీహెచ్సీని ఆయన మంగ ళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అం దుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకు న్నారు. గతంలో ఇక్కడ కాన్పులు జరిగేవి కాదని, ప్రస్తుతం కాన్పులు కూడా చేస్తున్నారని ప్రజలు తెలిపారు. రాత్రి పూట స్టాఫ్ ఉండటం లేదని, ఊరి చివర కావడంతో ఆగంతకులు ఎక్కువగా తిరుగుతున్నారని, మహిళా స్టాఫ్ భయపడుతు న్నారని స్థానికులు ఎమ్మెల్యేతో చెప్పారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ఐను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆస్పత్రి పరిశుభ్రంగా ఉందని, స్టాఫ్ చక్కగా పని చేస్తున్నారని నర్సులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజనీలు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. వైద్యుల కొరత లేకుండాప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. వైద్యులు కిరణ్మయి, స్పందన, శ్రీనివాసరావు, సురేఖారెడ్డి పాల్గొన్నారు,
