ఆర్థిక క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థాయి

ఆర్థిక క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య అన్నారు. మండల స్థాయిలో విద్యార్థులకు జి-20లో బాగంగా ఆర్బిఐ ఆల్ ఇండియా క్విజ్ ను నిర్వహించారు. ఆర్థిక ఆక్షరాస్యత (ఫైనాన్సియల్ లిట్రసీ) పై క్విజ్ను నిర్వహించారు. కెనరా బ్యాంకు మేనేజర్ పసుపులేటి ధర్మసాయి మాట్లాడుతూ ..మొదటగా మండల స్థాయిలో విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలైన వారికి ఈనెల 28న జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని చెప్పారు. మండల స్థాయిలో లక్కవరం, తూర్పు గంగవరం, నాగంబొట్లపాలెం, శివరామపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కెజిబివి విద్యార్థులు క్విజ్లో పాల్గొన్నారు. అందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరం ప్రధమ స్థానంలో. తూర్పు గంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం, వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలచారు. విజేతలకు ప్రధమ బహుమతి రూ. 5వేలు, ద్వితీయ బహుమతి రూ. 4వేలు, తృతీయ బహుమతి రూ. మూడు వేల రూపాయల చొప్పున బ్యాంకు మెనేజర్ ధర్మ సాయి, ఎంఈఓ సుబ్బయ్యలు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *