ఎదైనా ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాలతో పశువులు మృతి చెందినప్పుడు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ పశుభీమా చేదోడుగా ఉంటుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె. బేబిరాణి అన్నారు. మాధవరం గ్రామంలో బుధవారం పశు, జీవాల పోషకులకు భీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక కుటుంబానికి గరిష్టంగా ఐదు ఆవులు లేదా ఐదు గెదేలు, జీవాలు అయితే 50 గొర్రెలు లేదా మేకలు భీమాలో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం 80శాతం సబ్సిడీ ఇస్తుందని, కేవలం రైతు 20శాతం మాత్రమ ఇన్సు్యూరెన్స్ను చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అనంతరం సన్న జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసారు. పశుభీమా పథకంలో 50 గొర్రెలు, 18 గెదేలను నమోదు చేయించారు. దర్శి ఎడీఏ పురుషోత్తమరాజు, తాళ్లూరు, తూర్పు గంగవరం పశువైద్యులు వి. ప్రతాప్ రెడ్డి, రాంబాబు, విహెచ్ఎలు పాల్గొన్నారు.
