రైతులు పండించే ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తున్నాం – జిల్లా వ్వవసాయాధికారి శ్రీనివాసరావు – చిరుధాన్యాల సాగు పెంపు లక్ష్యంగా కృషి

రైతు పండించే ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ సాగుకు ప్రభుత్వం ప్రొత్సాహిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాసరావు అన్నారు. శివరామపురంలో శుక్రవారం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ జిల్లాలో చిరుధాన్యాల సాగ 57వేల ఎకరాలలో సాగు చేయించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 2లక్షల ఎకరాలలో అపరాలు, కందులు సాగుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు.. 38వేల మందికి కౌలు రైతు కార్డులు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం మినికిట్సను అందించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఎఈఓ నాగరాజు, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *