శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి హెచ్చరించారు. లక్కవరం గ్రామాన్ని శనివారం రాత్రి సందర్శించిన ఆయన ప్రజలతో సమావేశం నిర్వ హించారు. గ్రామంలో చిన్న చిన్న విషయాలపై ఘర్షణ పడకుండా శాంతి యుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నపాటి ఘర్షణలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు. ఆయన వెంట దర్శి సీఐ భీమా నాయక్, ఎస్సై ప్రేమ్ కుమార్ లు ఉన్నారు.
