దర్శి పట్టణం లో షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం జరిగి రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించిన ఘటన శనివారం తెల్లవారుజామున దర్శిలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివ రాల మేరకు.. దర్శి పట్టణ నడిబొడ్డులోని సెల్ఫోన్ టవర్ బజారులో మేడా హనుమంతరావు మూడు అంతస్తులు గత ఏడాది ఆగస్టులో నిర్మించారు. కింది. మొదటి అంతస్తులో దుస్తుల దుకాణం, రెండో అంతస్తులో నివాసం, ఆపైన పెంట్ హౌస్ ఉన్నాయి. రెండో అంతస్తులో నివాసం ఉండేందుకు వచ్చేనెల 10వ తేదీన చేరేలా ముహూర్తం కూడా పెట్టుకున్నారు. రోజూలాగే శుక్రవారం రాత్రి గం .9.30కు దుస్తుల దుకాణం మూసేసి ఇంటికెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కింది ఫ్లోర్ లోని దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయినట్లు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో భవనం లో నుంచి పొగలు వస్తు న్నాయని గమనించిన స్థానికులు హనుమంత రావుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి మంటలు పెద్దవి అయి పై అంతస్తు దాకా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయడంతో రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు అదుపు చేశాయి. మూడో అంతస్తులో ఇంటి పనిచేస్తున్న కూలీలు పడుకుని
ఉన్నారు. వారికి ఫోన్లో సమాచారం ఇచ్చి పక్క భవనం నుంచి కిందకు తీసుకొచ్చారు. షాపులో దుస్తుల సరుకు సుమారు రూ.1.50 కోట్ల వరకు ఉంది. కౌంటర్లో నగదు రూ.15 లక్షలు మొత్తం ఆగ్నికి ఆహుతయ్యాయి. షాపు, ఇంటి ఫర్నిచర్ కలిపి మరో కోటి రూపాయల వరకు ఉంటుంది. మొత్తం బుగ్గిపాలైందని బాధితుడు వాపోయాడు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించినా దుస్తులు కావడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసి పడ్డాయి. అతి కష్టం మీద శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్క భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానికులు కూడా తమ వంతు సహకరిం చారు. ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకునిట్రాఫిక్ నియంత్రించి మంటలు ఆర్పేందుకు సహకరించారు.
అగ్ని ప్రమాద బాధితునికి బూచేపల్లి పరామర్శ ..
షార్ట్సర్క్యూట్లో అగ్ని ప్రమాదం జరిగి రూ.3 కోట్ల వరకు నష్టపోయిన మేడా హనుమంత రావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకు న్నారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యా న్నిచ్చారు. ఆయన వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీరెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, నాయకులు వెన్నపూస బాపిరెడ్డి, విలియం కేరి, శ్రీనివాసరెడ్డి, నరశింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


