తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆరుదశాబ్దాల అనంతరం మండలంలోని రజక సంఘం ఆధ్వర్యంలో నాగార్పమ్మ కొలుపులు ఘనంగా నిర్వహంచారు. జీర్ణ అవస్థకు చేరిన నాగార్పమ్మ దేవాలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడి జీర్ణోద్ధరణ చేసారు. అనంతరం రూ. 16లక్షల వ్యయంతో గుడి నిర్మాణం, అన్నదానం నిర్వహించారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు పలు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బంధు మిత్రులు రాకతో గ్రామం కళ కళ లాడినది.
